బెంగుళూరులో తారా స్థాయికి చేరుకున్న గొడవలు, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

Advertisement

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస రావు అల్లుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిన్నరాత్రి ఎమ్మెల్యే ఇంటి పై ఆందోళన కారులు దాడులు చేశారు.

శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డి.జే.హళ్లి ఠాణాపై రాళ్ల దాడి చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌ ఎదుట ఉన్న వాహనాలను తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి సహా, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసన కారులు మృత్యువాత పడ్డారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here