Tirupati By election : తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి యువ ఎంపీ? ఆయనొస్తే బీజేపీ గెలిచినట్టే ఇక?

Tirupati By election : ఏపీలో వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. 2019 ఎన్నికలు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇటీవల జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాయి. త్వరలో పరిషత్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కానీ.. అన్నింటి కన్నా ఎక్కువ ఆసక్తి మాత్రం తిరుపతి ఉపఎన్నిక మీదనే ఉన్నది. తిరుపతి ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీతో పాటు.. టీడీపీ, బీజేపీ పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. తిరుపతి ఎన్నికల్లో గెలిచి.. ఏపీలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తోంది.

బీజేపీ హైకమాండ్ కూడా తిరుపతి ఉపఎన్నిక మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. అందులోనూ జనసేనకు టికెట్ ఇవ్వకుండా.. బీజేపీయే నిలబడటంతో.. బీజేపీకి ఈ గెలుపు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.

అయితే.. బీజేపీ పోటీ చేయగానే కాదు కదా.. అక్కడ గెలవాలంటే.. ఎన్నికల ప్రచారం బాగా చేయాలి. ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. ప్రజల మనసును గెలచుకోవాలి. కానీ.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ పార్టీ.. ఏదో సాదాసీదాగా ప్రచారం చేస్తే మాత్రం గెలిచే చాన్సెస్ అస్సలు ఉండవు.

అందుకే.. తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి యువ ఎంపీని దించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోందట. ఆయన ఎవరో కాదు.. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య. తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ తేజస్వి సూర్య వచ్చి ప్రచారం చేశారు. అంతకు ముందు చాలాసార్లు హైదరాబాద్ వచ్చి బీజేపీ మీటింగ్స్ లో ఆయన పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే.. తేజస్వీని దించి.. తిరుపతి ఉపఎన్నికల్లో గెలవాలని బీజేపీ ఎత్తులు వేస్తోందట.

తేజస్వీకి కూడా ఏపీలో ప్రచారం చేయడం ఇష్టమేనట. ఎలాగూ ఏపీ.. కర్ణాటక సరిహద్దు కావడంతో… ఏపీలో ప్రచారం చేస్తే.. తనకు దేశవ్యాప్త గుర్తింపు లభిస్తుందని.. తేజస్వీ అభిప్రాయపడుతున్నారట. అలాగే.. బీజేపీ హైకమాండ్ కూడా తేజస్వి అయితేనే తిరుపతి ఉపఎన్నికను మేనేజ్ చేయగలడని నమ్ముతోందట. అందుకే.. ఆయన్ను త్వరలోనే తిరుపతిలో దింపే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. మరి.. తేజస్వి మ్యాజిక్ తిరుపతిలో వర్కవుట్ అవుతుందా? లేదా? అంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement