Aindrila Sharma : మృత్యు ఒడికి చేరుకున్న యువ నటి అండ్రిలా శర్మ.! నిండా పాతికేళ్లు కూడా నిండకుండానే.!
NQ Staff - November 20, 2022 / 10:23 PM IST

Aindrila Sharma : సినీ పరిశ్రమలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయ్. తెలుగులో సీనియర్ నటులు కృష్ణం రాజు, కృష్ణ ఇటీవల కొన్ని నెలల వ్యవధిలోనే తనువు చాలించిన సంగతి తెలిసిందే.
ఈ విషాదం మరువక ముందే, బెంగాళీ నటి అండ్రిలా శర్మ మరణం సినీ పరిశ్రమను కలిచి వేస్తోంది. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ నటి అందని లోకాలకు వెళ్లిపోయింది.
అంతులేని కెరీర్.. అర్ధాంతరంగా అనంత లోకాలకు.!
నటిగా ఎంతో కెరీర్ చూడాల్సిన ఈ ముద్దుగుమ్మ గతంలో రెండు సార్లు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. సినిమా కష్టాలన్నీ అండ్రిలా ఒంట్లోనే వున్నట్లుగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ ఆ ఆనందాన్ని సరిగ్గా ఆస్వాదించకుండానే బ్రెయిన్ స్ట్రోక్‌తో ఇటీవల (నవంబర్ 1) ఆసుపత్రిలో చేరింది.
పరిస్థితి విషమించడంతో, వెంటిలేటర్ పైనే కొన్ని రోజులు చికిత్స అందించారు. కానీ, ఈ సారి పోరాడి ఓడిపోయిందీ అందాల కెరటం. పలు మార్లు కార్డియక్ అరెస్ట్‌కి గురి కావడంతో, అండ్రిలాని కాపాడలేకపోయారు వైద్యులు.
చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా పలితం లేకపోయింది. మృత్యు ఒడిలోకి జారుకుంది ఈ అందాల భామ. ‘జియోన్ కతి’, ఝమర్’, జిబన్ జ్యోతి’ తదితర బెంగాలీ సీరియళ్లలో నటించిని అండ్రిలా ‘దీదీ నెంబర్ 1’, ‘లవ్ కేఫ్’ తదితర సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.