Karnataka Elections : ఇంటికి రూ.30 వేలు.. ఒక కోడి.. ఎన్నికల్లో పంచిన నేతలు..!

NQ Staff - May 14, 2023 / 11:30 AM IST

Karnataka Elections : ఇంటికి రూ.30 వేలు.. ఒక కోడి.. ఎన్నికల్లో పంచిన నేతలు..!

Karnataka Elections : ఇప్పుడు ఎన్నికలు అంటే ఓట్లను అడుక్కోవడం నుంచి కొనుక్కోవడం లాగా మారిపోయింది. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. మందు సీసా అందిందా లేదా.. డబ్బులు అందాయా.. లేదంటే ఇంకేదైనా గిఫ్టులు అందాయా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు ఓటర్లు. వారికి తగ్గట్టుగానే క్యాండిడేట్లు కూడా బాగానే పంచుతున్నారు.

ఇక తాజాగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. 224 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ఇందులో ప్రతి నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేశారు. కానీ అన్నింటికంటే ఎక్కువగా బళ్లారి సిటీలోనే పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

బళ్లారి సిటీ నియోజకవర్గంలో 2,59,184 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పోటీ చేసిన జాతీయ పార్టీ అభ్యర్థులు, లోకల్ పార్టీ అభ్యర్థి భారీగా పంచినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటర్ కు రూ.5వేల చొప్పున ఒక్కో ఇంటికి రూ.25వేల నుంచి రూ.30వేల దాకా పంపిణీ చేశారు. అలాగే ఇంటికి ఒక కోడిని కూడా పంచినట్టు సమాచారం.

ఇంత మొత్తంలో ఖర్చు పెట్టిన నియోజకవర్గంగా బళ్లారి రికార్డుల కెక్కింది. మొదటి నుంచి ఇక్కడ పోటీ వాతావరణం భారీగానే ఉంటుంది. ఇక బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో కూడా బాగానే ఖర్చు పెట్టారు అభ్యర్థులు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us