భారీ పేలుళ్లతో దద్దరిల్లిన బీరుట్

Advertisement

బీరుట్: లెబానిన్ రాజధాని అయిన బీరుట్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. బీరుట్ పోర్ట్ లో గత ఆరు సంవత్సరాలుగా నిల్వ ఉన్న 2750 టన్నుల అమ్మోనీయం నెట్రేట్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 78 మృతి చెందగా, 4000 మందికి పైగా గాయపడ్డారు. భారీ పేలుళ్లు సంభవించడంతో పోర్ట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పోర్ట్ పక్కన ఉన్న పెద్ద పెద్ద భవనాలు కూడా గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్నాయి.

ఈ పేలుళ్ల వల్ల ఏర్పడిన శబ్దం 248 కీ.మీ వరకు వినిపించిందని అధికారులు వెల్లడించారు. కొన్ని కిలో మీటర్స్ వరకు ఈ పేలుళ్ల ప్రభావం చూపడంతో కిటికీలు, అలంకార వస్తువులు పగిలిపోయాయి. ఈ పేలుళ్లపై స్పందించిన దేశ అధ్యక్షకుడు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. గాయపడ్డవారికి రక్తం అవసరం కావడంతో క్షేమంగా ఉన్నవారు స్థానిక హాస్పిటల్స్ కు వెళ్లి రక్త దానం చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here