మాస్కులు అవసరం లేదు, ఎక్కడో తెలుసా ?
Admin - August 21, 2020 / 12:31 PM IST

కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు ఆదేశించారు. ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి అంటే మాస్క్ లేకపోతే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా చైనాలో మాస్కులు పెట్టుకోవడం అవసరం లేదని ప్రకటించారు. తమ దేశంలో కరోనా కట్టడిలోనే ఉందని, మాస్కుతో పని లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చైనా రాజధాని బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కూడా రావచ్చని వెల్లడించారు.
అయితే బీజింగ్‌లో గడిచిన 13 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవ్వలేదు. దీనితో మాస్కులు అవసరం లేదని తాజాగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రజల్లో మాత్రం ఇంకా కరోనా భయం వీడలేదు. దీంతో చాలా మంది మాస్కులు ధరించే బయటకు వస్తున్నారు.