Corona Second Wave : కరోనా టెస్ట్ రిపోర్ట్ రాకముందే కరోనా భయంతో ప్రాణాలు విడిచాడు

Corona Second Wave : కరోనా వైరస్ వ్యాప్తి కన్నా ఎక్కువగా కరోనా భయమే ప్రజల ప్రాణాలను తీస్తోంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన 30 ఏళ్ల అశోక్ కరోనా భయంతో తన ప్రాణాలను విడిచాడు. కరోనా టెస్ట్ చేయించుకున్నాక.. రిపోర్టులు కూడా రాకముందే… కరోనా వచ్చిందేమోనన్న టెన్షన్ తో ప్రాణాలు వదిలాడు అశోక్.

before getting corona reports man died with fear in nizamabad dist
before getting corona reports man died with fear in nizamabad dist

గత కొన్ని రోజులుగా అశోక్… తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో… ఆయన తల్లి గంగామణి… అశోక్ ను రెంజల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అశోక్ కు కరోనా వచ్చిందేమోనని కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. అశోక్ కూడా తనకు కరోనా వచ్చిందని భయపడ్డాడు. రెంజల్ ఆసుపత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు చేయించారు.

ర్యాపిడ్ టెస్ట్ లో అశోక్ కు కరోనా నెగెటివ్ గా చూపించింది. అయినా కూడా కుటుంబ సభ్యులు భయపడి మరోసారి టెస్ట్ చేయాలంటూ ఆసుపత్రి సిబ్బందిని కోరారు. దీంతో మరోసారి పరీక్షలకు శాంపిల్స్ తీసుకున్నారు. టెస్ట్ రిజల్ట్స్ రావడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో… ఆసుపత్రి బయట కాసేపు సేద తీరుదామని అశోక్, ఆయన తల్లి గంగామణి… చెట్టు కిందికి వెళ్లారు.

అశోక్ చెట్టు కింద కూర్చొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అశోక్ కూర్చున్నట్టుగానే కూర్చొని చనిపోవడంతో అశోక్ తల్లి గంగామణి తీవ్రంగా రోదించింది. గంగామణి రోదన చూసి అక్కడున్న వాళ్లంతా కంటతడి పెట్టారు. అయితే… రెండోసారి టెస్ట్ రిజల్ట్స్ లోనూ అశోక్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. కేవలం ఆయన జ్వరం వచ్చింది అంతే.. కానీ కరోనా వచ్చిందేమో… పేద కుటుంబం ఎలా కరోనా చికిత్స చేయించుకోవలన్న టెన్షన్ తో అశోక్… గుండెపోటుకు గురయి మరణించి ఉంటాడని డాక్టర్లు వెల్లడించారు.

Advertisement