అందుకే హీరోలు, నిర్మాతలు పూజా హెగ్డే నే కావాలంటుంది..ఇలా అయితే ఎవరు వదులుతారు ..?
Vedha - November 7, 2020 / 10:30 AM IST

మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకప్పుడు హృతిక్ రోషన్ నటించిన మొహంజాదారో నటించి ఫ్లాప్ అందుకోవడంతో మళ్ళీ బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. అయితే టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతలకి, హీరోలకి లకీ హీరోయిన్ గా మారింది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ అందరిలోను వచ్చేసింది.
అందుకే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిన ఇవ్వడానికి నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. అయితే పూజా హెగ్డే కూడా సినిమా ఒప్పుకుంటే ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నిర్మాతలకి దర్శకులకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా సినిమా కంప్లీట్ చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా భాష ఏదైనా మేకర్స్ కి కావాల్సింది ట్రబుల్ ఇవ్వని హీరోయిన్సే. చాలా వరకు హీరోయిన్స్ సినిమా కమిటయ్యే ముందు ఒకరకంగా కమిటయ్యాక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరకంగా మారుతుంటారు.
కాని ఈ విషయంలో పూజా హెగ్డే కి హ్యాట్సాఫ్ చెప్పాలని అంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా జరిగిన ఒక విషయాన్ని చూపిస్తున్నారట. గత నెలలో రాధే శ్యామ్ బృందం తో కలిసి ఇటలీ షెడ్యూల్ కి వెళ్ళింది పూజా హెగ్డే. అక్కడ పూజా హెగ్డే – ప్రభాస్ కి సంబంధించిన సీన్స్ కంప్లీట్ అయ్యాక టీం కంటే ముందే పూజా ముంబై చేరుకుంది. అక్కడ ఒక హిందీ సినిమా కి సంబంధించిన పనులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని అంటున్నారు. ఇంత డెడికేషన్ .. హార్డ్ వర్క్ చూసి మేకర్స్ అండ్ హీరోలు ఫిదా అవుతున్నారట. నిజంగా పూజా హెగ్డే లాంటి హీరోయిన్ కోసమే మేకర్స్ ఎదురు చూసేది. ఇలాంటి హీరోయిన్ ని ఎవరు వదులుకుంటారు చెప్పండి.