హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమా మీద క్రేజ్ ఎందుకంటే ..?

Vedha - October 31, 2020 / 02:49 PM IST

హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమా మీద క్రేజ్ ఎందుకంటే ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరసగా కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వకీల్ సాబ్ సెట్స్ లో జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ అవుతాడంటున్నారు.

Pawan Kalyan's Vakeel Saab teaser to release on October 25? - Movies News

డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా మొదలు పెట్టేందుకు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ చేసి.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి తెరకెక్కించే సినిమాలను సమాంతరంగా చేస్తాడట. ఇక ఇటీవల ప్రకటించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించనున్న “అయ్యప్పనం కోషియమ్” రీమేక్ లో నటించాల్సి ఉంది.

ఈ సినిమాని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మరోసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి త్రివిక్రం మాటలు అందిస్తున్నాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ లో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

News18 Telugu - PSPK 28: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా క్రేజీ అప్‌డేట్..  తొలిసారి ఆ పాత్రలో పవర్ స్టార్.. | Happy Birthday PSPK 28 Pawan kalyan Play  crucial politician charecter in ...

కాగా అఫీషియల్ గా 6 సినిమాలు చేయబోతున్నప్పటికి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా మీదే భారీగా అంచనాలున్నాయని తెలుస్తుంది. అందుకు కారణం గబ్బర్ సింగ్ సినిమా సాధించిన సక్సస్ అంటున్నారు. ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ చిత్రాలతో పాటు ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష – గులాబీ పువ్వు కనిపించేలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ వల్లే ఈ సినిమాపై ఊహించని రీతిలో అంచనాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us