BCCI: కొత్త జెర్సీలో టీమిండియా ఆట‌గాళ్లు.. సందేశాలు పంపుతున్న అభిమానులు

BCCI: ఐపీఎల్ సంద‌డి మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం మొద‌లు కానుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే ఈ టోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

BCCI unveils Team India's new jersey ahead of T20 World Cup
BCCI unveils Team India’s new jersey ahead of T20 World Cup

2021 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు ప్రైజ్ మనీ రూపంలో రూ.12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభిస్తుంది. అలాగే ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన జట్టుకి అందులో సగం అంటూ రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు.

అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు సందేశాలు పంపుతున్నారు.

పొట్టి ఫార్మాట్‌లోని ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రధాన జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచులు కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. తొలుత 18వ తేదీన ఇంగ్లండ్‌తో, ఆ తర్వాత 20వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించబోమని ఐసీసీ ప్రకటించింది.