బీసీసీఐ అధికారికి కరోనా పాజిటివ్

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. తాజాగా బీసీసీఐ అధికారికి కూడా కరోనా సోకింది. అయితే ఐపీల్ యూఏఈ లో జరగనున్న నేపథ్యంలో అన్ని టీమ్ లు, బీసీసీఐ అధికారులు యూఏఈ కి వెళ్లారు. అయితే యూఏఈ వెళ్లిన వారికీ కరోనా భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే చెన్నై టీమ్ లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరోవైపు యూఏఈలో ఉన్న బీసీసీఐ వైద్య బృందంలోని ఒక అధికారికి కూడా కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేనప్పటికీ, క్వారంటైన్ లో ఉంచామని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఇక అందరి ఆరోగ్యాన్ని పరీక్షించే మెడికల్ ఆఫీసరే కరోనా బారిన పడటంతో అందరు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీల్ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here