Mahendra Singh Dhoni : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ గా మహేంద్ర సింగ్ ధోనీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
NQ Staff - February 16, 2023 / 05:30 PM IST

Mahendra Singh Dhoni : టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇటీవల ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికి పోయాడు. టీం ఇండియా క్రికెటర్స్ లో చాలా మంది ఫిట్ గా లేరని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారికి ఇంజక్షన్స్ ఇచ్చి ఫిట్ గా ఉన్నట్లుగా చూపించి క్రికెట్ ఆడిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
చేతన్ శర్మ వ్యాఖ్యలతో వెంటనే బీసీసీఐ ఆయనపై చర్యలకు సిద్ధమయింది. చేతన్ శర్మ స్థానంలో మాజీ టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
బీసీసీఐ అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులు ధోనీ అయితే టీం ఇండియాకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చారట. ధోని నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు కొత్త వారికి అవకాశాలు ఇచ్చే విధంగా బిసిసిఐ అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.
అందుకే ప్రతిభావంతుడైన ధోనీకి ఆ బాధ్యతలు అప్పగించాలని క్రికెట్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో కానీ ఒక వేళ టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ గా మహేంద్రసింగ్ ధోని ఎంపిక అయితే కచ్చితంగా మంచి విజయాలు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.