అవును.. కళ్యాణి నన్ను వదిలి వెళ్ళిపోయింది : సూర్య కిరణ్

Advertisement

బిగ్ బాస్ ఫోర్ లో సందడి చేసిన సూర్య కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే తాజాగా ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న ఆయన తన భార్య కళ్యాణి గురించి చెప్పుకొచ్చాడు. అయితే కళ్యాణి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, వసంతం, దొంగోడు వంటి చిత్రాలతో కళ్యాణి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. అవును కళ్యాణి నన్ను వదిలి వెళ్ళిపోయింది.

అయితే అది నా నిర్ణయం కాదు. నాతో కలిసి బతకాలని కళ్యాణికి ఇష్టం లేదని చెప్పాడు. నాతో ఎటువంటి సమస్యలు లేకున్నా.. కలిసి జీవించకపోవడానికి ఆమెకు కారణాలున్నాయని సూర్యకిరణ్ పేర్కొన్నాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ద్వారా కళ్యాణిని మిస్సవడం లేదని, ప్రతీ రోజు కళ్యాణిని మిస్సవుతున్నానని భావోద్వేగానికి గురయ్యాడు. కళ్యాణి నాకు బాగా కనెక్ట్ అయి పోయింది. ఈ జన్మకు నా భార్య కళ్యాణినేనని సూర్య కిరణ్ వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here