డేంజర్ జోన్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

Admin - October 9, 2020 / 05:57 AM IST

డేంజర్ జోన్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…
బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 ఇప్పుడు ఐదోవారంలోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్స్ కంటే కూడా ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికీ అలవాటు అయ్యారు. ఎవరికి వారికే ఫెవరెట్ కంటెంస్టెంట్స్ గా మారారు. ఈ టైమ్ లో ఐదోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, నామినేషన్స్ లోకి ఏకంగా 9 మంది ఉండటమే దీనికి కారణం. దీంతో ఓటింగ్ వేసిన పలు సైట్స్ మాత్రం చాలా విషయాలు చెప్తున్నా.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం ఆసక్తిగానే ఉంది.
ఎందుకంటే, లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా ఎలిమినేషన్ అనేది ఫెయిర్ గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీక్ సూర్యకిరణ్, సెకండ్ వీక్ కరాటే కళ్యాణి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు కానీ, థర్డ్ వీక్ మాత్రం దేవి ఎలిమినేషన్ ని సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, ఆ తర్వాత నాలుగోవారం స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ కూడా ఫెయిర్ కాదని అన్నారు. ఎందుకంటే, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒకవారం సెటిల్ అయ్యేందుకు టైమ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అలాగే, దేవిని ఎలిమినేట్ అయిపోయిన కళ్యాణి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా అన్నారు.
అందుకే ఈ సారి ఎలిమినేషన్ అనేది రసవత్తరంగా మారింది. అయితే, ఈ సారి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా.. లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సింగిల్ ఎలిమినేషన్ ఉన్నట్లు అయితే, డేంజర్ జోన్ లో మాత్రం నలుగురు కనిపిస్తున్నారు.
అరియానా, మోనాల్, సుజాత, అమ్మరాజశేఖర్ మొత్తం నలుగు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఇక సోహైల్, నోయల్, అభిజిత్, అఖిల్, లాస్యలు ఐదుగురు సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. లక్షల్లో ఓటింగ్ జరుగుతున్న వెబ్ సైట్స్ ఇస్తున్న సమాచారం ప్రస్తుతానికి ఇదే. అయితే, లీస్ట్ లో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం చూసినట్లయితే అమ్మరాజశేఖర్, అలాగే సుజాత ఇద్దరూ లీస్ట్ లో ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చూడాలి.
మరోవైపు అమ్మరాజశేఖర్ మంచి కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి సుజాతని ఎలిమినేట్ చేసేస్తారని అంటున్నారు చాలామంది. లాస్ట్ టైమ్ కూడా మెహబుబ్ బాగా కంటెంట్ ఇస్తున్నాడని చెప్పి స్వాతిని ఎలిమినేట్ చేసారని, అలాగే ఈ సారి కూడా చేస్తారేమో అని చెప్తున్నారు.
ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 4 లో ఎలిమినేషన్ అనేది పెయిర్ గా జరగట్లేదని సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మంచిగా గేమ్ ఆడేవాళ్లని పంపించేస్తే కిక్ ఉండదని అబిప్రాయపడుతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us