బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై ఊహించిన వ్యాఖ్యలు..!

Advertisement

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాజకీయ నాయకులు మరియు సినీ నటులు చాలా మంది కరోనా భారిన పడ్డారు. అలా కరోనా భారిన పడిన చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే తాజాగా కామిడీయన్ బండ్ల గణేష్ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.. కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండి మొత్తానికి కరోనా నుండి కోలుకున్నాడు బండ్ల గణేష్.

అయితే కరోనా తో కోలుకున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను కరోనా తో కోలుకున్న తరువాత చాలామంది ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగారని అయన అన్నారు. దాంట్లో చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నరాని ఆయన అన్నారు. తనకు ఫోన్ చేసిన వారిలో డైరెక్టర్ మారుతీ, రాజా రవీంద్ర , శ్రీకాంత్ , వివి వినాయక్ , శ్రీను వైట్ల మరియు చిరంజీవి ఇలా అందరు కూడా తనకు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగారని బండ్ల గణేష్ తెలిపారు.

దాంట్లో చాలా వరకు నాతో సంబంధం లేని వారే ఫోన్ చేసారని… కానీ నాకు సంబందించిన వారు అంటే తాను నటించిన లేక తనతో కలసి పని చేసిన వారు మాత్రం ఎవ్వరు చేయలేదని అయన అన్నారు. తనకు మోహన్ బాబు కూడా ఫోన్ చేసాడు అని ఆరోగ్యం ఎలా ఉందని అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పారని బండ్ల గణేష్ అన్నాడు.

కానీ తాను అభిమానించే నటుడు మరియు నాయకుడు తనకు ఫోన్ చేయాలదని అన్నాడు. తను దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ మాత్రం ఫోన్ చేయాలదని అన్నారు. తాను ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి అడుగుతాడని అనుకున్ననాని బండ్ల గణేష్ అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయాలదని.. తనను ఫోన్ చేసి పలకరించక పోవడంతో భాదగా ఉందని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here