Bandla Ganesh: మీరంతా న‌న్ను క్ష‌మించాలి అంటూ మీడియా వారికి రిక్వెస్ట్ చేసిన బండ్ల గ‌ణేష్‌

Bandla Ganesh: సినీ ‘మా’ ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు క‌లిసి క‌ట్టుగా ఉన్న వారు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఒకరి మాటలకి మరొకరు కౌంటర్లను విసురుతున్నారు. ఇప్పటికే రెండు ప్యానల్స్ మధ్యలో యుద్ధమే నడుస్తుంది. మ‌ధ్య‌లో బండ్ల గ‌ణేష్ త‌న దైన‌శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌దవికి నామినేష‌న్ వేసిన బండ్ల‌.. తనకి పరమేశ్వరుడి మద్దతు ఉందని, ‘మా’ కుటుంబంలో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను గెలవడం పక్కా అని తెలిపారు. ఇంతకు ముందు గెలిచినా వాళ్ళు ఏమి చేయలేదని అన్నారు. అడిగితే కరోనా ఉందని తప్పించుకుంటున్నారు.

గ‌త రెండేళ్ల‌లో చాలా అన్యాయం జ‌రిగింది. అధ్య‌క్షుడిని ఎన్నుకున్న‌ప్పుడు గౌర‌వించాలి. మ‌ర్యాద ఇవ్వకుండా, క్ర‌మ శిక్ష‌ణ లేకుండా.. ఆగ‌మాగం చేస్తున్నారు. కొన్ని త‌ప్పుడు ప‌దాలు నోటి నుండి వ‌స్తున్నాయి. అవి రాకుండా జాగ్ర‌త్త‌గా మాట్లాడుతున్నాను. న‌న్ను మీరంతా క్ష‌మించాలి. ‘మా’ అసోసియేషన్‌కు భవనం కావాలి అంతే కానీ జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ఇంద్రభవనం కడతామంటే కుదరదు.

100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి మహా ప్రభో మాకు స్థలం ఇప్పించండి, మా డబ్బులతో పేద కళాకారులకు ఇళ్లు కట్టిస్తాం అని అడిగితే ఆయన కాదనరని నా నమ్మకం అని అన్నారు. ఈ సారి నేను గెలిస్తే పేద కళాకారులకు ఇళ్ళు కట్టడానికి కెసిఆర్ ని స్థలం ఇమ్మని అడుగుతానని, మన హీరోలు ఒక్కొక్కరు వజ్రాల్లాంటి వాళ్ళు, వారు దయతలిచి సహాయం చేస్తే 100 మంది పేద కళాకారులకి ఆ స్థలంలో ఇళ్ళు కట్టిస్తాను అని మీడియాతో తెలిపాడు బండ్ల గణేష్.