Bandla Ganesh : త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్‌కి వాళ్ళంతా దూరమవుతున్నారు: బండ్ల గణేష్
NQ Staff - January 4, 2023 / 12:56 PM IST

Bandla Ganesh : త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద గతంలో బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సమయంలో పెద్ద రచ్చే జరిగింది.. బండ్ల గణేష్ వ్యాఖ్యల తీరుతో. అప్పటినుంచీ పవన్ – బండ్ల గణేష్ మధ్య గ్యాప్ పెరిగింది కూడా.!
పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని పిలుస్తుంటాడు బండ్ల గణేష్. కానీ, ఏమయ్యిందో.. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ విషయమై బండ్ల గణేష్ కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రవిక్రమ్ శ్రీనివాస్ వల్లనే చాలామంది దర్శకులు, నిర్మాతలు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారని, త్రివిక్రమ్ పేరెత్తకుండానే విమర్శలు చేశాడు.
గురూజీలు.. బురూజీలూ..
‘గబ్బర్ సింగ్’ సినిమాతో తిరుగులేని విజయం పవన్ కళ్యాణ్‌కి లభించింది.. ఆయన స్టార్‌డమ్ వేరే లెవల్. ఆయనలో ఆ ప్రత్యేకతని నేనెప్పుడో గుర్తించాను. చాలామంది దర్శకులు ఆయనతో మంచి మంచి కథలు సిద్ధం చేసుకుంటున్నారు.. నిర్మాతలూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేయడానికి రెడీగా వున్నారు..