Bandla Ganesh : చంద్రబాబును దరిద్రం అంటూ తిట్టేసిన బండ్ల గణేశ్.. ట్వీట్ వైరల్..!
NQ Staff - June 4, 2023 / 05:26 PM IST

Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడుతారో చెప్పలేం. తాజాగా ఆయన మాటల బాణాలు చంద్రబాబు మీద పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేశ్ తన రాతలకు పని చెప్పారు.
ఆయన ఇలా ట్వీట్ చేశారు. ఖర్మ కాకపోతే ఇంకేంటి.. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి, బీజేపీ అంటే బీజేపీ అనాలి, జనసేన అంటే జనసేన అనాలి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. అంతే తప్ప ఎవరికీ ఆత్మాభిమానం ఉండకూడదు. ఆయన పొగిడితే జాతిని పొగిడినట్టు.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు దరిద్రం అంటూ రాసుకొచ్చాడు బండ్ల.
ఈ మాటలు చంద్రబాబును ఉద్దేశించే చేశారని తెలుస్తోంది. అంటే టీడీపీ తమ్ముళ్ల ఆత్మాభిమానం గురించి పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు చేస్తున్నారంటూ ఉద్దేశం వచ్చేలా బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొన్నటి వరకు జనసేనతో పొత్తు పెట్టుకుంటారనే టాక్ ఉండేది.
కానీ ఇప్పుడు మాత్రం రూటు మార్చారు చంద్రబాబు. అసలే పవన్ భక్తుడు అయిన బండ్ల.. ఇలా జనసేనతో కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేకనే ఇలాంటి ట్వీట్ చేశాడేమో అంటున్నారు నెటిజన్లు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం బండ్ల మీద సీరియస్ అవుతున్నారు. చంద్రబాబును విమర్శిస్తావా అంటూ కడిగేస్తున్నారు.