Bandla Ganesh: బండ్ల గణేష్ హీరోగా సినిమా?..

Bandla Ganesh: తెలుగు సినిమాల్లో తొలుత కమెడియన్ గా చేసి తర్వాత హీరోగా క్లిక్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. అలీ, సునిల్, వేణుమాధవ్ ఇలా పలువురిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ లిస్టులో ఇప్పుడు బండ్ల గణేష్ కూడా చేరబోతున్నాడని అంటున్నారు. ఒక తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారని, అందులో హీరోగా బండ్ల గణేష్ అయితేనే బాగుంటుందని ఒక డైరెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి బండ్ల గణేష్ కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ మూవీకి నిర్మాత కూడా బండ్ల గణేషే వ్యవహరించనున్నాడట. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బిజినెస్ లో బిగ్ సక్సెస్ సాధించి బండ్ల గణేష్ రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. కథనాయకుడిగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

కోలీవుడ్ లో ‘మండేల’..

తమిళంలో రూపొందించిన ‘మండేల’ పిక్చర్ రెండు విధాలుగా పాపులర్ అయింది. ఒకటి.. వివాదాస్పదంగా. రెండు.. విజయంపరంగా. విడుదలకు ముందు విపరీతంగా నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించటం విశేషం. దక్షిణాఫ్రికా దివంగత అధ్యక్షుడు నెల్సన్ మండేలా పేరును ఈ సినిమాకి టైటిల్ గా పెట్టడం ఆసక్తికరం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామెడీ-డ్రామా పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో తమిళ నటుడు యోగిబాబు మంచి మార్కులు కొట్టేశాడు. ఆ రోల్ ని తెలుగులో బండ్ల గణేష్ పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. నెల 4వ తేదీనే డైరెక్టుగా స్టార్ విజయ్ టీవీ ఛానల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫిల్మ్ రీమేక్ రైట్స్ ని కైవసం చేసుకోవటం కోసం బండ్ల గణేష్ బాగానే కష్టపడ్డట్లు ఇండస్ట్రీ టాక్.

కొంచెం లేటయ్యే ఛాన్స్..

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగులు కూడా కష్టంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ హీరోగా నటించబోయే సినిమా చిత్రీకరణ పట్టాలెక్కేందుకు టైమ్ పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై కాబోయే హీరో బండ్ల గణేష్ అఫిషియల్ గా స్పందించాల్సి ఉంది. నిర్మాతగా సెటిలయ్యాక ఇతను సినిమాల్లో నటించటం తగ్గించాడు. రీసెంటుగా మహేశ్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’లో మెరిశాడు. చేస్తే గీస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయినట్లున్నాడు. సోషల్ మీడియాలో తరచూ చేసే బండ తప్పుల్లాంటివి చేయకపోతే బండ్ల గణేష్ హీరోగా వెలిగిపోతాడనటంలో అనుమానం లేదు. నటనపరంగా అతనిలో అంత ఈజ్ ఉంది.

 

Advertisement