Bandi Sanjay Targeting Bhumana Karunakar Reddy : తెలంగాణలో సరే.. బండి ప్లాన్ ఏపీలోనూ పనిచేస్తుందా?
NQ Staff - August 22, 2023 / 07:20 PM IST

Bandi Sanjay Targeting Bhumana Karunakar Reddy :
తెలంగాణలో బీజీపీ బలం పెరగడానికి, పార్టీ గొంతు ప్రజల్లోకి చొచ్చుకపోవడానికి బండి సంజయే ప్రధాన కారణం అనేది ఎవరూ కాదనలేని ఓపెన్ ఫ్యాక్ట్. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో, హాట్ హాట్ స్పీచులతో కేసీఆర్ సర్కారుపై ఫైరవుతూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలిచి అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.
ఇప్పుడు అదే స్ట్రాటెజీని ఏపీలోనూ ఫాలో అయేందుకు రెడీ అయ్యాడు బండి సంజయ్. ఆంధ్ర ప్రదేశ్ ఇంఛార్జిగా బండి సంజయ్ ని నియమించే అవకాశాలున్నాయంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడ పర్యటనలో భాగంగా బండి చేసిన కామెంట్స్ ఆంద్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. మీకు బైబిల్ కావాలా? భగవద్గీత కావాలా? అంటూ వ్యాఖ్యలు చేశాడు బండి సంజయ్. ఎన్నికల అఫిడవిట్ లో భూమన ఏ మతానికి చెందిన వ్యక్తి అని రాశాడు? అని ప్రశ్నించాడు. దీంతో తెలంగాణలో ఇలాగే వివాదాస్పద కామెంట్లతో వ్యక్తుల్ని, పార్టీల్ని టార్గెట్ చేసిన బండి సంజయ్.. ఇప్పుడు ఏపీలో కూడా అదే స్ట్రాటెజీని ఫాలో అవుతూ ఓటు బ్యాంక్ పెంచుకునే ఆలోచనతో కామెంట్స్ చేస్తున్నాడన్న మాటలు ఆంద్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి వేరు. ఏపీ పరిస్థితి వేరు. తెలంగాణలో ప్రతిపక్షంగా పెద్దగా గుర్తించని స్థాయి నుంచి బీజేపీని ప్రధాన ప్రతిపక్ష స్థాయి వరకూ తీసుకొచ్చి, పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచడం కోసం బండి తన స్ట్రాటెజీలను బలంగా నమ్మాడు. విమర్శలు, కేసులు, అరెస్టులు.. ఇలా ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా వెనక్కి తగ్గకుండా ర్యాష్ గానే దూసుకెళ్తూ రాజకీయాల్లో హీటు పెంచాడు. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే ప్లాన్ ని వర్కవుట్ చేయాలనుకుంటే మాత్రం సక్సెస్ అవుతారా? లేదా? బండి ఫార్ములా జగన్ దగ్గర వర్కవుట్ అవుతుందా లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పాయింట్.
గతంలో తెలంగాణ బీజేపీ పరిస్థితే ఇప్పుడు ఏపీలోనూ ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా, ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా, ఏదో ఓ రకంగా రాజకీయ వార్తల్లో నిలిచేలా చేయాలంటే ఇప్పుడున్న తీరు మార్చుకుని సరికొత్త స్ట్రాటెజీలను ఫాలో అవ్వాల్సిందే. కానీ తెలంగాణలో పనిచేసిన బండి మంత్రం అక్కడా పనిచేస్తుందా? అనే మ్యాటర్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.