Bandi Sanjay : బండి సంజయ్ ఉంటే.. ఆ ఓట్లన్నీ బీజేపీకి పడేవా..?

NQ Staff - December 7, 2023 / 10:48 AM IST

Bandi Sanjay : బండి సంజయ్ ఉంటే.. ఆ ఓట్లన్నీ బీజేపీకి పడేవా..?

Bandi Sanjay :

బండి సంజయ్.. ఈ పేరు వింటేనే ఫైర్ బ్రాండ్ అని అందరూ ఊహించేసుకుంటారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉంటాయి మరి. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అని అన్న స్థాయిలో ఉన్న పార్టీని.. తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. అడ్రస్ లేని పార్టీని అధికారంలో ముందు వరుసలో ఉంచేందుకు చేయని ప్రయత్నమే లేదు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే బీజేపీ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అప్పటి వరకు బీఆర్ ఎస్ కు పోటీ అంటే కాంగ్రెస్ మాత్రమే అనుకుంటున్న వారికి.. బీజేపీని రేసులో నిలిపి సమాధానం చెప్పాడు.

బండి సంజయ్ హయాంలో యూత్ మొత్తం బీజేపీ వైపు మళ్లిపోయింది. మరీ ముఖ్యంగా నిరుద్యోగులు అందరూ బీజేపీకి మద్దలు పలికారు. కాంగ్రెస్ ఎలాగూ చచ్చుబడిపోయింది అన్నట్టు ఉండటంతో.. బీజేపీ వైపు అందరూ మొగ్గు చూపారు. అందుకే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ కార్పొరేటర్లే అధికంగా గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు.. ఇతర ఎన్నికల్లో కూడా సత్తా చాటింది బీజేపీ. దానికి కారణం బండి సంజయ్ అనే చెప్పుకోవాలి. ఇలా ఫైర్ బ్రాండ్ గా ఆయన దూసుకుపోతున్న సమయంలో బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ బీజేపీకి మళ్లుతున్నాయి.

ఒకవేళ బండి సంజయ్ హయాంలోనే ఎన్నికలకు బీజేపీ వెళ్లి ఉంటే మాత్రం కచ్చితంగా బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి పడేవి. వాస్తవానికి బండి సంజయ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ లో ఎవరూ పోరాడలేదు. ఈ ఐదేండ్లలో కాంగ్రెస్ కీలక నేతలు అందరూ తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది లేదు. పెద్దగా పోరాటు చేసింది కూడా లేదు. కానీ బీఆర్ ఎస్ ను కాదని కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేశారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే అదంతా కాంగ్రెస్ ఏదో చేసిందని వేసిన ఓట్లు కావు.

బీఆర్ ఎస్ మీద ఉన్న కోపంతో వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ కు పడ్డ ఓట్లు మాత్రమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ వ్యతిరేక ఓట్లు మరి బీజేపీకి ఎందుకు పడలేదు. ఎందుకంటే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేశారు కాబట్టి. ఒకవేళ బండి సంజయ్ ఉండి ఉంటే ఈ వ్యతిరేక ఓటు కచ్చితంగా బీజేపీకి పడేది.

నిరుద్యోగులు, ఇతర పథకాల్లో నష్టపోయిన వారందరూ ప్రధానంగా బీజేపీకి మాత్రమే ఓట్లు గుద్దేవారు. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ సంజయ్ లేకపోవడంతో వారికి బీజేపీ మీద నమ్మకం పోయింది. అందుకే వేరే ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్ కు ఓటేశారు జనాలు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us