Narendra Modi : సంజయ్‌ను చూసి నేర్చుకోండి.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు
NQ Staff - January 17, 2023 / 09:48 AM IST

Narendra Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 350 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 37 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇక రోడ్ షో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. సమావేశం చివర వరకు ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలోనే ఉన్నారు. ఇక ఈ సమావేశాల్లో భాగంగా మోడీ మాట్లాడారు. అయితే ప్రసంగంలో భాగంగా బండి సంజయ్ పై ప్రశంసలు కురిపించారు.
కలిసి వచ్చే అంశం..
బండి సంజయ్‌ను చూసి నేర్చుకోండి అంటూ అగ్ర నాయకులకు సూచించారు. బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో బండి సంజయ్‌ను పొగడటం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇక ఈ సమావేశాల్లో బండి సంజయ్ కూడా మాట్లాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు సంగ్రామ యాత్ర పై #BJPNationalExecutive మీటింగ్ లో దాదాపు గంటకు పైగా ప్రజెంటేషన్ ఇచ్చాడు బండి సంజయ్. ఇక బండి సంజయ్ మాట్లాడుతున్నంత సేపు అగ్ర నాయకులు కూడా ఆసక్తిగా విన్నారు.