Bandi Sanjay Focused On Karimnagar : కరీంనగర్ లో సంజయ్ వ్యూహం ఏంటి.. గంగుల మీద గెలుస్తారా..?

NQ Staff - August 31, 2023 / 02:31 PM IST

Bandi Sanjay Focused On Karimnagar : కరీంనగర్ లో సంజయ్ వ్యూహం ఏంటి.. గంగుల మీద గెలుస్తారా..?

Bandi Sanjay Focused On Karimnagar :

బండి సంజయ్ అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందు.. ఆ తర్వాత అన్నంతగా ఆయన రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న వారికి ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. సంజయ్ అంటే ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి మైలేజ్ తీసుకువచ్చిందే ఆయన. అందుకే ఆయన్ను ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు టార్గెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బీజేపీలో అగ్ర నేతగా ఉన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయభేరీ మోగించారు.

అయితే ఆయన డ్రీమ్ మాత్రం ఇంకా నెరవేరలేదు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో దగ్గరదాకా వచ్చి ఓడిపోయారు. కరీంనగర్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ మీద ఆయన పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. బీజేపీలో గోషామహల్ తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది బీజేపీకీ కరీంనగర్ లోనే. అయితే ఆ సారి మిస్ అయింది కానీ.. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ లో ఎమ్మెల్యేగా గెలవాలని సంజయ్ గట్టి పట్టు మీద ఉన్నారు. అందుకే ఈ సారి తన వ్యూహాలను రచించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ సారి కరీంనగర్ లో హిందూ ఎంజెండా తోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే ఈ సారి యూత్ లో ఆయనకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. పైగా బీసీ నేతగా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి ఇటు హిందూ ఓట్లతో పాటు అటు బీసీల ఓట్లు కూడా సంజయ్ కు పడే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా ఆయన ఎంపీగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కూడా తీసుకువచ్చారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని సంజయ్ అనుచర వర్గం చెబుతోంది.

గతంలో కంటే ఈ సారి ఓటు బ్యాంకు కచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే సంజయ్ కూడా ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారంట. కరీంనగర్ లో తన సొంత కాపు సామాజిక వర్గం కూడా బాగానే ఉంది. వారంతా గంగుల కంటే సంజయ్ కు మద్దతు తెలుపుతున్నారు. అందుకే సంజయ్ కూడా గెలుపు సాధ్యమే అన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ఈ సారి కరీంనగర్ మీద కేంద్ర బీజేపీ కూడా బలమైన ఫోకస్ పెడుతోంది.

అందుకే కేంద్ర నాయకత్వం కూడా ఈ సారి కరీంనగర్ లో ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా సంజయ్ కు కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న ఆయన ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. చూడాలి మరి సంజయ్ కు ఏ మేరకు కలిసి వస్తుందో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us