Bandi Sanjay Appointed National General Secretary Of BJP : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్.. ఫైర్ బ్రాండ్ కు దక్కిన గౌరవం..!

NQ Staff - July 29, 2023 / 11:47 AM IST

Bandi Sanjay Appointed National General Secretary Of BJP : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్.. ఫైర్ బ్రాండ్ కు దక్కిన గౌరవం..!

Bandi Sanjay Appointed National General Secretary Of BJP :

బండి సంజయ్ అంటే తెలంగాణలో బీజేపీ బలాన్ని పెంచిన నేత. పార్టీకి తిరుగులేని ఇమేజ్ ను పెంచారు. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. తన పదునైన మాటలతో యూత్ మొత్తాన్ని పార్టీవైపు మళ్లించారు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది అంటే అది బండి సంజయ్ వల్లే అని చెప్పుకోవాలి. అలాంటి సంజయ్ ను ఎలక్షన్ల ముందు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.

దాంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తెలంగాణ బీజేపీ శ్రేణుల అంసతృప్తిని చల్లార్చేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీజేపీ జాతీయ నూతన కమిటీని ప్రకటించారు. ఇందులో 9 మంది కొత్త ప్రధాన కార్యదర్శులను నియమించారు.

గుర్తించిన అధిష్టానం..

ఇందులో బండి సంజయ్ కు చోటు దక్కింది. ఆయన అవసరాన్ని పార్టీ గుర్తించి కీలక పదవిని కట్టబెట్టింది. ఇక కొత్తగా 13 మంది ఉపాధ్యక్షులను కూడా ప్రకటించింది. డీకే అరుణను ఎప్పటి లాగానే ఉపాధ్యక్ష పదవిలో కొనసాగించింది. ఇన్ని రోజులు స్టేట్ వరకే పరిమితం అయిన బండి.. ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారన్న మాట.

ఈ విషయం తెలుసుకుని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కీలక పదవితో బండి సంజయ్ బాధ్యతలు మరింత పెరగనున్నాయి. ఆయన మళ్లీ రాష్ట్ర స్థాయిలో తన పవర్ చూపించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు పదవి రావడంతో బండి మళ్లీ యాక్టివ్ అవుతారని అంతా ఆశిస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us