Health Tips : నల్లని మచ్చలున్నాయని అరటి పండు పడేస్తే వారు తెలివి తక్కువ వాళ్లు
NQ Staff - December 30, 2022 / 03:21 PM IST

Health Tips : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు పోషకాలు మరియు అన్ని రకాల విటమిన్లు ఇచ్చే పండ్లను తీసుకోవాలి అంటూ వైద్యులు సూచిస్తూ ఉంటారు. వైద్యుల సలహా మేరకు ఎక్కువ శాతం మంది అరటి పండ్లు తింటూ ఉంటారు.
అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉండడంతో పాటు ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉన్నాయి. పైగా తక్కువ రేటుకు ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి. కనుక ఎక్కువ శాతం మంది అరటి పండ్లు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అరటి పండ్లు తినేందుకు ఇంట్రెస్ట్ గా ఉంటారు. అయితే అరటి పండు పై నల్లటి మచ్చలు ఉన్నాయని కొద్ది మంది పడేస్తూ ఉంటారు. అలా పడేసిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలి.
ఎందుకంటే నల్ల మచ్చలు లేని అరటి పండ్లలో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సోడియం ఎక్కువగా ఉంటుంది. నల్లమచ్చలు ఉన్న అరటి పండులో యాంటీ యాసిడ్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.
సాధారణంగా పసుపు కలర్ లో ఉన్న అరటి పండ్లతో పోలిస్తే నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు 8 రెట్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని జపాన్ పరిశోధకులు గుర్తించారు. అందుకే ఇకపై అరటి పండు పై నల్ల మచ్చలు ఉన్నాయని పడేయకుండా తింటే మంచిది.