సీఎం కెసిఆర్ కు బాలాపూర్ లడ్డు

Advertisement

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు అంతంత మాత్రానే జరిగాయి. అయితే తెలంగాణాలో బాలాపూర్ గణేశుడి లడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతి సారి బాలాపూర్ లడ్డుకు వేలం నిర్వహించి పోటీ పడి కొనుగోలు చేయడనికి ముందుకు వస్తారు. కానీ ఈ ఏడాది లడ్డు వేలం నిర్వహించలేదు. దీనితో ఈ ఏడాది లడ్డును సీఎం కెసిఆర్ కు ఇవ్వాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ నేపథ్యంలో ఈరోజు బాలాపూర్ లడ్డు ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బాలాపూర్ గణేష్ కమిటీ సభ్యులు సీఎం కెసిఆర్ కు అందజేశారు. అయితే 1994లో మొదటి సారిగా 450 రూపాయలు పలకగా, 2019లో 17.60 లక్షల రూపాయలు పలికింది. ఇక గత 26 సంవత్సరాలుగా లడ్డు ధర పెరగడమే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తగ్గలేదు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here