కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య

Advertisement

తెలుగు అగ్ర కథానాయకుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే తెలుగు ప్రజలకు, తెలుగు నేలకు, తెలుగు రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన హీరో, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది. తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సోషల్ స్టడీస్ లో ఈ లేసన్ ను చదువుకొనున్నారు.

తన తండ్రి అయిన ఎన్టీఆర్ గురించి భవిష్యత్ తరాలకు తెలియాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి బాలకృష్ణ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మద్రాసియులుగా పేరున్న తెలుగు జాతికి ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశంతో తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చారని బాలయ్య తెలిపారు. తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్ గురించి భవిష్యత్ తరాలకు తెలియాలని బాలయ్య తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here