Balakrishna : జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన బాలయ్య.. నందమూరి ఫ్యామిలీలో చీలికలు..!
NQ Staff - November 12, 2023 / 10:35 AM IST

Balakrishna :
బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో.. ఎలాంటి కామెంట్లు చేస్తారో చెప్పడం కూడా చాలా కష్టం. ఆయన స్టేజిపై మాట్లాడుతూ.. అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. ఇంకొన్ని సార్లు కావాలనే కొన్ని కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఇటు రాజకీయంగానే కాకుండా ఇటు నందమూరి ఫ్యాన్స్ నడుమ ప్రకంపనలు రేపుతున్నాయి. బాలయ్య రీసెంట్ గా నటించిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ మంచి హిట్ అయింది. కాకపోతే అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.
ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను రెండు రోజుల క్రితం నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య సంచలన కామెంట్లుచేశారు. తనను ఎవరైనా బాబాయ్ అంటే వారికి దబిడి దిబిడే అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించే చేశారని అంటున్నారు. ఎందుకంటే చాలా స్టేజిల మీద బాలయ్యను బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా సార్లు వ్యాఖ్యానించాడు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇలా బాలయ్య కామెంట్లు చేశాడని అంటున్నారు. పరోక్షంగా తారక్ కు తగిలే విధంగానే ఈ కామెంట్లు ఉన్నాయని అంటున్నారు.
అయితే బాలయ్య ఇలా కామెంట్లు చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు నందమూరి కుటుంబం మొత్తం స్పందించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ ను ఎలా వాడుకుని వదిలేశాడో ఆయనకు బాగా తెలుసు. ఆ మధ్య భువనేశ్వరి విషయంలో స్పందిస్తే.. చివరకు టీడీపీ నేతలే ఎన్టీఆర్ ను తిట్టారు. అందుకే చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు. అప్పుడు బాలయ్య కోపానికి వచ్చాడు. ఐ డోంట్ కేర్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఇదే డైలాగ్ ను తన సినిమాలో కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తనను బాబాయ్ అని కూడా పిలవొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. దాంతో ఇప్పుడు ఇది కాస్తా పర్సనల్ గా వెళ్తోంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కల్యాణ్ రామ్ కూడా స్పందించలేదు.
దాంతో ఇప్పుడు ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చాడా బాలయ్య అని అంటున్నారు. బాలయ్య చేసిన కామెంట్లు ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని చీల్చేస్తున్నాయి. దాంతో పాటు నందమూరి అభిమానులను కూడా చీలుస్తున్నాయి. అందుకే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయట్లేదు. చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత గ్యాప్ పెరిగేలా ఉంది.