Balakrishna : విజయ సాయి రెడ్డి ‘ జైలు ‘ జీవితం గురించి టాప్ సీక్రెట్ బయటపెట్టిన బాలకృష్ణ

Balakrishna : ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అందుకే ఏపీలో నేతలు అంతా ఫుల్ బిజీ అయిపోయారు. మొన్ననే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అవి అయిపోగానే.. మళ్లీ మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ దూకుడు మామూలుగా లేదు. ఏకంగా నందమూరి బాలకృష్ణ కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ చతికిల పడటంతో.. ఈసారి నందమూరి బాలకృష్ణ.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన తన ప్రచారంలో అధికార వైసీపీ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

ఈసందర్భంగా బాలయ్య బాబు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కొన్ని ఆరోపణలు చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయసాయిరెడ్డికి కర్మాగారానికి, కారాగారానికి తేడా తెలియదు. అటువంటి నాయకులు కూడా ఉన్నారు. అయినా మనకు కారాగారానికి చీటికీ మాటికీ వెళ్లి రావడం అలవాటేగా.. అందుకే.. కర్మాగారానికి బదులు కారాగారం అని నోటి నుంచి వచ్చింది.. అంటూ విజయసాయిరెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు బాలకృష్ణ.

అసలు ఏమైందంటే.. ఇటీవల.. వైజాగ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ తో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి ప్రసంగిస్తూ… విశాఖ ఉక్కు కర్మాగారం అనబోయి.. విశాఖ ఉక్కు కారాగారం.. అనేశారు. దానిపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. తర్వాత తన తప్పును విజయసాయి తెలుసుకున్నప్పటికీ.. విజయసాయిరెడ్డి చేసిన తప్పు ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ విషయాన్నే బాలయ్య బాబు కూడా లేవనెత్తారన్నమాట.

Advertisement
Advertisement