Boyapati Srinu : బాలకృష్ణ గెస్ట్‌… బోయపాటి కోసం మొదటి సారి

NQ Staff - November 3, 2022 / 11:00 AM IST

Boyapati Srinu : బాలకృష్ణ గెస్ట్‌… బోయపాటి కోసం మొదటి సారి

Boyapati Srinu : రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

బోయపాటి ఆఖండ సినిమా తర్వాత సినిమా అవడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రామ్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో ఈ సినిమాతో సక్సెస్ తప్పించుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో రామ్ కష్టపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో తెగ జరుగుతుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్ కోసం నందమూరి బాలకృష్ణను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

బాలకృష్ణకు సింహ, లెజెండ్, అఖండ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి అడిగితే బాలకృష్ణ కాదు అనడని అంతా నమ్ముతున్నారు. కనుక రామ్ సినిమాలో బోయపాటి కచ్చితంగా బాలకృష్ణను తీసుకొస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ గతంలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న గెస్ట్ రూల్స్ లో కనిపించాడు, కానీ ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే ఆయన పాత్ర ఉంటుందని.. కథకు అత్యంత కీలకంగా బాలకృష్ణ రోల్ ఉంటుందని సమాచారం అందుతుంది.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసింది.

ఈ సమయంలో బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో గెస్ట్‌ రోల్ కి బాలయ్య ఓకే చెప్పాడు అనే సమాచారం అందుతుంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us