Akkineni Nagarjuna : మరో వివాదం రాజేసిన బాలయ్య.. ఈ సారి నాగార్జునపై అలాంటి కామెంట్లు..!
NQ Staff - January 27, 2023 / 12:07 PM IST

Akkineni Nagarjuna : నందమూరి బాలకృష్ణ సృష్టించిన వివాదం ఇంకా చల్లారనే లేదు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ రంగారావు, ఆ రంగరావు.. ఈ అక్కినేని, తొక్కినేని అంటూ ఏఎన్నార్‌పై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉంది. నాగచైతన్య, అఖిల్ కూడా సీరియస్ గా స్పందించారు.
అంతే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్లు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య స్పందించాడు. నాగేశ్వర్ రానును నేను చాలా ప్రేమిస్తా.. ఆయన దగ్గర నుంచి పొగడ్తలకు దూరంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నేను ఆయన్ను బాబాయ్ అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
నాగార్జున ప్రేమ చూపించలేదా..
ఈ క్రమంలోనే మరో వివాదాన్ని కూడా రాజేశాడు. ఆయన కన్న వారి కంటే నన్నే ప్రేమగా చూసుకునే వాడు, అక్కడ ఆప్యాయత లేదు.. ఇక్కడ ఆప్యాయత ఉంది ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ తెలిపాడు. అంటే నాగార్జున ఆప్యాయతను చూపించలేదని, తాను ఆప్యాయతను చూపించానని ఇన్ డైరెక్టుగా చెప్పాడన్న మాట.
అంటే ఇప్పుడు పరోక్షంగా నాగార్జునను కూడా అవమానించినట్టే అని అక్కినేని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నాగార్జునకు, బాలయ్యకు మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు బాలయ్య చేసిన కామెంట్లు ఆ వివాదాన్ని మరింత పెంచాయనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో.