సీఎం జగన్ ను కలవనున్న బాలకృష్ణ

Advertisement

హిందూపూర్ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. హిందూపూర్ అభివృద్ధి గురించి చర్చించడానికే జగన్ ను కలవబోతున్నానని బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించానని బాలయ్య తెలిపారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని, కక్ష పూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని బాలయ్య తెలిపారు.

హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.55లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందజేశారు. తాను ఎక్కడ ఉన్నా కూడా హిందూపూర్ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటానని వెల్లడించారు. కరోనా సమయంలో బాలయ్య ఇప్పటికే చాలామందికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే బసవతారకం హాస్పిటల్ లో పని చేస్తున్న సిబ్బందికి కూడా నిత్యావసర వస్తువులు బాలయ్య అందించిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here