Balakrishna-Honey Rose : హనీరోజ్ తో మందు కొడుతూ చిల్ అవుతున్న బాలయ్య..!
NQ Staff - January 23, 2023 / 11:00 AM IST

Balakrishna-Honey Rose : ఈ నడుమ సెలబ్రిటీలు సక్సెస్ పార్టీలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు. పైగా తాము ఏం చేసినా ప్రజలకు తెలియాలి అన్నట్టు చేసేస్తున్నారు. పబ్లిక్ గానే మందు కొట్టేస్తున్నారు. పైగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. జనాలు తమ గురించి ఏం అనుకుంటారు అనేది కూడా అస్సలు ఆలోచించట్లేదు.
ఇక తాజాగా బాలయ్య చేసిన పని కూడా ఇలాగే ఉంది. ఆయన రీసెంట్ గా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ కొట్టింది. సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలయ్య ఇద్దరూ పోటీ పడ్డారు. వీరిద్దరూ ఇలా గతంలో కూడా చాలా సార్లు పోటీ పడ్డారు.
ఆమెతో కలిసి..
కాగా ఇద్దరి సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నాయి. బాలయ్య నటించిన వీరిసింహారెడ్డి మాస్ యాంగిల్ లో మంచి హిట్ అందుకుంది. కాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాలయ్య తాజాగా పార్టీ చేసుకున్నాడు. ఇందులో నటించిన హనీరోజ్ తో కలిసి ఆయన పార్టీ చేసుకున్నాడు.
ఈ పార్టీలో ఆమెతో కలిసి మందు తాగుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకరి చేయిని ఒకరు పట్టుకున్నట్టు మందు తాగేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన వారిలో కొందరు విమర్శిస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.