సింగర్ బాలు కోసం పూజలు చేస్తున్న బాలయ్య

Advertisement

తెలుగు సినీ పరిశ్రమలో హిట్ ప్లాప్ లకు సంబంధం లేకుండా నందమూరి బాలయ్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బాలయ్య పేరు చెప్పగానే చాలామందికి ఆయన కోపము గుర్తుకు వస్తుంది, ఇంకొంతమండికి ఆయన మంచితనం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు సింగర్ బాల సుబ్రమణ్యం విషయంలో బాలయ్య చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోతున్నారు. సింగర్ బాలు ఆసుపత్రిలో చేరినప్పటి నుండి బాలయ్య ప్రతిరోజు ఆయన కోసం పూజలు చేస్తున్నారని నటుడు శుభలేఖ సుధాకర్ తెలిపారు.

ప్రతిరోజు ఫోన్ చేసి మరీ బాలు ఆరోగ్యం గురించి బాలయ్య తెలుసుకుంటున్నాడని సుధాకర్ తెలిపారు. కరోనా సమయంలో కూడా బాలయ్య చాలామందికి సహాయం చేశారు. మొన్ననే హిందూపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షలు విలువ చేసే వైద్య సామాగ్రిని బాలయ్య అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా బాలయ్య ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు తెలుసుకున్న వారు బాలయ్యలో కోపము కాదు మంచితనం కూడా ఉందని ఒప్పుకుంటారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here