Balakrishna : ఈ భాష ఏంటి బాలయ్య.. సీఎం అనే రెస్పెక్ట్ కూడా లేదా..?
NQ Staff - December 22, 2023 / 11:35 AM IST
Balakrishna :
బాలయ్య.. పేరుకే సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. కానీ ఎన్టీఆర్ కు ఉన్న ఒక్క పోలిక కూడా లేదని ఆయన ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వస్తున్నాడు వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అంటే ఆ పార్టీ పగ్గాలు తీసుకోవాలి. కానీ బాలయ్య స్థానం మాత్రం పార్టీలో ఒక మూలన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎలాంటి పెంట పెడుతారో ఎవరికీ అర్థం కాదు. అందుకే చంద్రబాబు కూడా బాలయ్యను అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే బాలయ్య మాట్లాడితే చివరకు టీడీపీ పరువు పోతుందని చంద్రబాబుకు కూడా తెలుసు.
ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను ఎన్నడూ మాట్లాడించరు. కానీ మొన్న యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు తన బావమరిది అయిన బాలయ్యకు మైక్ ఇచ్చాడు. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టు ఆయన నోటికి పని చెప్పాడు. జగన్ హైదరాబాద్ కు వెళ్తే మాత్రం సరిహద్దుల్లోనే కాల్చి చంపుతారు అని తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలను వాడాడు బాలయ్య. ఒక సీఎంను పట్టుకుని ఇలాంటి మాటలు ఎలా అంటాడు అని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతటితో ఆగని బాలయ్య.. లూయిస్ 18 అన్న ఫ్రాన్స్ రాజు ప్రస్తావన తెచ్చాడు.
ఆయన్ను బయటకు తీసి కాల్చి చంపారని చెప్పాడు. అంటే రేపు పొద్దున ఏపీలో కూడా జగన్ ను అలా చేయాలని ఆయన చెబుతున్నారు. జగన్ ను కాల్చి చంపాలని తీవ్రమైన వ్యాఖ్యలను వాడుతున్నాడు బాలయ్య. ఒక సీఎం అనే మర్యాద కూడా లేకుండా బాలయ్య ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి స్టేజిపై ఉన్న వారికి కూడా చిరాకు పుట్టించాడు. అంత ఘోరాతి ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు మరి. దాంతో పాటు ఈ ఐదేళ్లు ఎక్కడ చచ్చాడో తెలియదని.. ఇప్పుడు ఉచిత పథకాలు అంటూ మళ్లీ వస్తున్నాడు అంటూ జగన్ ను నిందించాడు బాలయ్య.
అసలు బాలయ్య ఉద్దేశంలో ఎవరిని నమ్మొద్దని చెబుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్ చెప్పినట్టే ఐదేండ్ల పాటు ఉచిత హామీలను అమలు చేస్తున్నారు. కానీ గతంలో చంద్రబాబు ఉచిత హామీల పేరుతో మోసం చేసి బూటకపు మాటలు మాట్లాడాడు. పైగా యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు చాలానే ఉచిత హామీలను ప్రకటించాడు.
మరి బాలయ్యనేమో ఉచిత హామీలు ఇస్తున్నాడు కాబట్టి నమ్మొద్దు అని చెబుతున్నారు. అంటే బాలయ్య నమ్మొద్దని చెప్పేది చంద్రబాబు నేనా అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. చంద్రబాబు ఉద్దేశించే బాలయ్య ఇలాంటి కామెంట్లు తెలియక చేస్తున్నాడేమో అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.