Balakrishna : అక్కినేని నాగేశ్వర్ రావును దారుణంగా అవమానించిన బాలయ్య.. భగ్గుమంటున్న ఫ్యాన్స్…!
NQ Staff - January 24, 2023 / 04:42 PM IST

Balakrishna : బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు నోరు జారి బూతులు కూడా మాట్లాడేస్తుంటారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అందరూ ఓపిగ్గా వినాల్సిందే తప్ప ఎవరూ ఆయనకు అడ్డు చెప్పడానికి ధైర్యం చేయబోరు. ఎందుకంటే ఆయన్ను ఆపితే ఎలాంటి బూతులు మాట్లాడుతాడో ఆయనకు కూడా తెలియదు.
ఇక రీసెంట్ గ ఆయన నటించిన మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ కొట్టింది. ఈ మూవీ గ్రాండ్ హిట్ కొట్టి రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో బాలయ్యతో పాటు మూవీ యూనిట్ సంబురాల్లో మునిగి తేలుతోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
కావాలనే అన్నాడా..?
ఇందులో బాలయ్య మాట్లాడుతూ.. తన పక్కన ఉన్న ఎవరో వ్యక్తి గురించి మాట్లాడబోయాడు. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని.. అంటూ బాలయ్య నోరు జారాడు. అయితే గతంలో నుంచే అక్కినేని ఫ్యామిలీకి, బాలయ్యకు అస్సలు పడట్లేదు. కాబట్టి కావాలనే బాలయ్య ఇలా అవమానించాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా అక్కినేని నాగేశ్వర్ రావు వర్ధంతి రోజే ఇలా ఆయన్ను అవమానించడంతో ఆయన అభిమానులు బాలయ్య మీద భగ్గుమంటున్నారు. ఎంత అహంకారం ఉంటే ఇలా మాట్లాడుతావు అంటూ ఆయన్ను తిట్టి పోస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి బాలయ్య కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.