Balakrishna : అయ్యో బాలయ్య మళ్లీ నోరు జారాడు.. ఈసారి అంతకు మించి

NQ Staff - January 26, 2023 / 06:12 PM IST

Balakrishna : అయ్యో బాలయ్య మళ్లీ నోరు జారాడు.. ఈసారి అంతకు మించి

Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అక్కినేని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా ఫ్లోలో ఆ మాటలు మాట్లాడాడా అనే విషయం పక్కన పెడితే చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చినవి కావు అంటూ స్పందిస్తే సరిపోతుంది. తాజాగా బాలకృష్ణ ఆ విషయమై మాట్లాడుతూ మరోసారి వివాదాన్ని పెంచేలా మాట్లాడాడు. ఒకవైపు ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదని, బాబాయి అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు చాలా అభిమానం అని అన్నాడు.

ఆయన పిల్లల కంటే నాతోనే ఎక్కువ సన్నిహితంగా ఆయన మాట్లాడేవారు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ఇన రేపుతున్నాయి. ఒక అడుగు ముందుకేసి అక్కడ అందని ఆప్యాయత నా దగ్గర అందుతుందని బాబాయ్ నాతో ఎక్కువగా మాట్లాడే వారు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కాంపౌండ్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు బాహాటంగానే అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో బాలకృష్ణపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆ వివాదం మరింతగా పెరిగి పెద్దది అయినట్లుగా కనిపిస్తోంది. ఎన్నార్‌ అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి గౌరవం అనడంలో సందేహం లేదు. అలాంటిది బాలయ్య అలా ఎలా కామెంట్స్ చేస్తాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us