Balakrishna And Anil Ravipudi : బాలయ్యతో మరోసారి జోడీ కట్టనున్న హనీ రోజ్? హాట్ బ్యూటీ క్రేజును క్యాష్ చేసుకుంటున్న అనిల్ రావిపూడి?
NQ Staff - January 24, 2023 / 04:07 PM IST

Balakrishna And Anil Ravipudi : హనీ రోజ్.. సోషల్మీడియాలో ఆ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు, ప్రాజెక్టులు, హిట్లు, ఫ్లాపులతో తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగుని పెంచుకుంటున్న హాట్ బ్యూటీ. పేరుకే మళయాళం హీరోయిన్ అయినా మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఇండస్ట్రీలతో, భాషలతో సంబంధం లేకుండా గ్లామర్ లుక్స్ కి యూత్ ఫిదా.
రీసెంటుగా వీరసింహారెడ్డి మూవీలో యంగ్ బాలయ్యకి తల్లిగా నటించింది హనీ రోజ్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్లలో కనిపించినా ఆమె గ్లామర్ అండ్ పర్ఫామెన్సుని పూర్తి స్థాయిలో వాడుకోలేదని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సినిమాకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ కూడా బానే వస్తున్నా హనీ రోజ్ హార్డ్ కోర్ అభిమానుల నుంచి మాత్రం నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.
అంత గ్లామరస్ బ్యూటీని వయసుమళ్లిన తల్లిపాత్రలో ఎలా చూయించారయ్యా? అసలు హనీరోజ్ లాంటి యాక్ట్రెస్ తో ఆ పాత్ర ఎలా అనుకున్నారు? అంటూ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ కామెంట్సుని అనలైజ్ చేసుకుని హనీ రోజ్ క్రేజును పక్కాగా క్యాష్ చేసుకునే ప్లాన్లో ఉన్నాడు అనిల్ రావిపూడి. బాలక్రిష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ స్టార్టయిన విషయం తెలిసిందే. ఈ అప్ కమింగ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా హనీ రోజ్ ను ఫైనల్ చేశాడట అనిల్.
గ్లామర్ తో పాటు పాత్రకు తగ్గ పర్ఫామెన్స్ కూడా చేస్తూ యాక్ట్రెస్ గా మాలీవుడ్లో మంచి పేరే సంపాదించుకుంది హనీ రోజ్. ఇక వీరసింహారెడ్డిలో తల్లిగా, లవర్ గా రెండు పాత్రల్ని పోషించి తన రోల్ కి జస్టిఫై చేసింది. దాంతో హనీ రోజ్ అయితే కమర్షియల్ గా మాత్రమే కాకుండా అవుట్ పుట్ పరంగా కూడా బాగా కలిసొస్తుందని అనిల్ రావిపూడి ఈ డెసిషన్ తీసుకున్నాడట.
ఎఫ్ త్రీ మూవీ అనుకున్న రేంజులో ఆడకపోవడంతో బాలయ్య సినిమాలో బాక్సాఫీస్ బంపర్ హిట్ కొట్టాలన్న ఆశతో ఉన్నాడు అనిల్ రావిపూడి. మరోవైపు వీరసింహారెడ్డితో సహా గత చిత్రాల్లో కర్నూలు, కడప, అనంతపురం నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాల్లో నటించి బాక్సాఫీసును షేక్ చేశాడు.

Balakrishna Anil Ravipudi Combo Movie Honey Rose Finalized As The Heroine
దాంతో వేరియేషన్ కనిపించేలా, ఫ్యాన్స్ కొత్తగా ఫీలయ్యేలా ఈ మూవీలో బాలక్రిష్ణ పక్కా తెలంగాణ యాస మాట్లాడతాడంటూ అనిల్ రావిపూడే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మరి కథ ప్రకారం బాలయ్యతో సహా హనీరోజ్ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడుతుందా? అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియలేదు.
ఇప్పటికే చాలా మంది మళయాళ భామలు తెలుగులో తెరంగేట్రం చేసి బిజీ స్టార్సయ్యారు. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్.. ఇలాంటి కేరళ కుట్టి యంగ్ హీరోయిన్ల లిస్టు చాలా పెద్దదే. మరి హనీ రోజ్ కూడా రానున్న కాలంలో వరుస ఆఫర్లతో టాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ అవుతుందా? సోషల్మీడియా క్రేజుతో పాటు ఇటు ఇండస్ట్రీలోనూ సక్సెస్ సాధిస్తుందా అనేది చూడాలి మరి.