Balakrishna And Chiranjeevi : వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లోనూ ఇంట్రస్టింగ్ కామన్ పాయింట్స్.. మీరు గమనించారా?
NQ Staff - January 16, 2023 / 12:29 PM IST

Balakrishna And Chiranjeevi : సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచి ప్రేక్షకులకు పండగ సందడి పెంచుతున్నారు బాలయ్య, చిరు. యాక్షన్, మాస్, సెంటిమెంట్, ఎలివేషన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాలుగా ఆడియెన్సుకు ఫుల్ పైసా వసూల్ అనిపిస్తూ థియేటర్లో అభిమానులతో అరిపిస్తున్నారు. రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన చిత్రాలవడం, రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే హీరోయిన్ అనే పోలికలు రిలీజు ముందు నుంచీ తెలిసినవే. కానీ విడుదలయ్యాక రెండు చిత్రాల్లోనూ చాలా కామన్ పాయింట్స్ కనిపించాయి.
ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కామన్ కాన్సెప్ట్ సవతి సోదర ప్రేమ. వీరసింహారెడ్డిలో బాలక్రిష్ణ సవతి తల్లికి పుట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్ చెల్లవగా, వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సవతి తల్లికి పుట్టిన తమ్ముడిగా రవితేజ రోల్ ఉంటుంది. ఈ రెండు పాత్రలూ ఓవైపు ఎఫెక్షన్ మరోవైపు కోపం ప్రదర్శిస్తూ కథని ఆసక్తిగా మలిచాయి. ఇక మరో కామన్ పాయింట్ విషయానికొస్తే.. వీరసింహారెడ్డిలో తండ్రిపాత్రలో నటించిన బాలక్రిష్ణ చనిపోయే ముందు చుట్ట తాగే సీన్ ఉంటుంది.
వాల్తేరు వీరయ్యలోనూ రవితేజ చనిపోయే ముందు చిరంజీవిని అడిగి మరీ బీడీ వెలిగించి ఇవ్వమంటాడు. ఇవే కాకుండా సినిమా చివర్లో ఆఖరి పాట ప్లేస్ మెంట్ కూడా రెండిట్లోనూ సంబంధం లేకుండా పెద్దగా పొసగనట్టుగా వచ్చి వెళ్తుంది. అప్పటికి కథ క్లైమాక్సుకి చేరే దశలో ఉండగా, మాస్ ఆడియెన్సు కోసమే ఇరికించి మరీ ఓ పాట పెట్టడంతో ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది అనిపించినా ఓవరాల్ గా నడిపోతుంది.
వీరసింహారెడ్డిలో విలన్ దునియా విజయ్ తండ్రిగా నటించిన ఫ్లాష్ బ్యాక్ విలన్, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ తో డ్రగ్ డీల్స్ చేసే మాఫియా డాన్ విలన్.. ఈ రెండు పాత్రల్ని ఒక్కరే చేశారు. ఇక ప్రధాన పాత్రలే కాకుండా గెస్ట్ రోల్స్ విషయంలోనూ ఇంట్రస్టింగ్ గా సిమిలారిటీస్ కనిపిస్తాయి. రైటర్ బీవీఎస్ రవి ఈ రెండు సినిమాల్లోనూ ఓ చిన్న పాత్రలో అలా మెరిసి మాయమవుతాడు.

Balakrishna And Chiranjeevi Are Creating Festival buzz For Audience Sankranti Box Office
ఇక హీరో ఇంట్రడక్షన్ ఫైట్ తోనే ఉండడం, వెంటనే ఓ సాంగ్ రావడం, హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేకపోవడం లాంటి రొటీన్ కమర్షియల్ ఫార్ములా స్క్రీన్ ప్లే కామన్ పాయింట్ల గురించయితే చెప్పకర్లేదు.
మరి రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచే వచ్చినా, ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఇన్ని పోలికలు కనిపించడం మాత్రం ఇంట్రస్టింగే అంటూ కామన్ ఆడియెన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నా రెండు సినిమాలూ బాక్సాఫీసును షేక్ చేస్తుండడం అయితే మంచి పాయింటే.