Balakrishna : బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో మాజీ సీఎం కిరణ్ ‘బాంబు’ పేల్చనున్నారా.?

NQ Staff - November 17, 2022 / 09:07 PM IST

Balakrishna : బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో మాజీ సీఎం కిరణ్ ‘బాంబు’ పేల్చనున్నారా.?

Balakrishna : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజన తర్వాత రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేరు. చాలా అరుదుగా మాత్రమే ఆయన మీడియా ముందుకొస్తుంటారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సందడి చేశారు.

సందడి.. అనడం కన్నా, పెద్ద బాంబు పేల్చారనడం సబబేమో. ఎందుకంటే, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి ఓ సీక్రెట్ కిరణ్ కుమార్ రెడ్డి రివీల్ చేసేలా వున్నారు.

బతికి వుండబట్టే ముఖ్యమంత్రినయ్యా..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ హెలికాప్టర్‌లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళాల్సి వుందనే ప్రచారం జరిగింది కూడా.

ఆ విషయాల గురించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారా.? ఓ సీనియర్ నేత అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తప్పుదారి పట్టించారని కిరణ్ ఎందుకు ఆరోపించారు.? రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడైన కిరణ్ కుమార్ రెడ్డి పేల్చబోయే ఆ బాంబు ఏంటి.?

‘ఆహా’లో ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూస్తే.. ఆ బాంబుపై స్పష్టత వస్తుందేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us