Balagam Singer Mogilaiah : బలగం మొగిలయ్య ఆరోగ్యం విషమం.. నిమ్స్ లో చికిత్స..!

NQ Staff - April 12, 2023 / 09:21 AM IST

Balagam Singer Mogilaiah : బలగం మొగిలయ్య ఆరోగ్యం విషమం.. నిమ్స్ లో చికిత్స..!

Balagam Singer Mogilaiah : బలగం సినిమా క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గతంలో నుంచే కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో డయాలసిస్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన పరిస్థితి విషమించింది. ఇప్పటికే ఆయనకు కిడ్నీ వ్యాధి ఉండగా.. ఇప్పుడు గుండెపోటు కూడా రావడంతో ప్రభుత్వం స్పందించింది.

మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో మంగళవారం రాత్రి మొగిలయ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఆర్సీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆయనకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు.

మెరుగైన వైద్యం అందించిన తర్వాత ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందంటున్నారు. మొగిలయ్యకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక మొగిలయ్య కోలుకోవాలంటూ చాలామంది కోరుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us