బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పై వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Advertisement

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగర వాసులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ లో గడుతుపుతారు. అయితే ఈ ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద కుడివైపు పైవంతెనను ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్లతో నిర్మించారు. దీంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ వంతెన నిర్మాణంలో దేశంలోనే మొదటిసారిగా స్లాబ్స్‌, క్రాష్‌ బారియర్స్‌, ఫిక్షన్‌ స్లాబుల నిర్మాణంలో ఆర్‌సీసీ ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీ వాడినట్లు మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. ఈ వంతెన 780 మీటర్ల పొడవు ఉంది. ఈ వంతన నిర్మాణంతో తమ ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరుతాయని నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here