YS Sharmila : వైఎస్‌ షర్మిల కి బెయిల్‌

NQ Staff - April 25, 2023 / 04:37 PM IST

YS Sharmila : వైఎస్‌ షర్మిల కి బెయిల్‌

YS Sharmila : పోలీసులను దూషించడంతో పాటు పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కి నాంపల్లి కోర్టు మెయిల్ మంజూరు చేసింది. 30 వేల రూపాయల పూచీకత్తు పై బెయిల్ ఇవ్వడం జరిగింది.

నిన్న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన వెంటనే షర్మిల తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. నేడు షర్మిల బెయిల్‌ పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించింది పోలీసులు పోలీసుల తరఫున లాయర్‌ లు వాదించారు.

పోలీసులు ఆమెను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారని.. అందుకే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతి స్పందించాల్సి వచ్చిందని ఆమె తరపు లాయర్‌ లు వాదించారట. అందుకే షర్మిలకు బెయిల్‌ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్‌ గూడా జైలులో ఉన్న ఆమె ఏ క్షణంలోనైనా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us