రాయలసీమ ప్రజలకి కొత్త ఐడియా వచ్చింది.. జగన్ కి బ్యాడ్ న్యూస్?

Ajay G - January 5, 2021 / 09:02 PM IST

రాయలసీమ ప్రజలకి కొత్త ఐడియా వచ్చింది.. జగన్ కి బ్యాడ్ న్యూస్?

రాయలసీమ. నిజానికి ఇది ఏపీలోనే ఉన్నా.. మిగితా ప్రాంతాలు అభివృద్ధి చెందినంతగా ఇది అభివృద్ధి చెందలేదు. కారణం.. ప్రభుత్వాలు రాయలసీమను పట్టించుకోకపోవడమే. రాయలసీమ రతనాల సీమ అని అన్నారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు చూస్తే.. రాయలసీమలో అభివృద్ధి కుంటుపడిపోయింది. రాయలసీమకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ వస్తోంది.

bad news to cm jagan over rayalaseema

bad news to cm jagan over rayalaseema

రాయలసీమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా రాయలసీమను పట్టించుకోలేదు. అమరావతినే రాజధానిగా చేశారు. దీంతో రాయలసీమ వాసులు చంద్రబాబును 2019 లో ఓడించారు. జగన్ కు జై కొట్టారు. జగన్ కూడా రాయలసీమకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు.

అందుకే… మూడు రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ తీసుకొచ్చారు. కనీసం హైకోర్టునైనా కర్నూలుకు తరలించాలని భావించారు. అందుకే కర్నూలును న్యాయరాజధానిగా జగన్ ప్రకటించారు. వైజాగ్ ను పాలనా రాజధానిగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచారు.

అయితే.. కర్నూలుకు న్యాయ రాజధాని బాగానే ఉంది కానీ.. విశాఖకు పాలనా రాజధాని ఇవ్వడమేంటి.. అంటూ సీమ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే.. రాజధాని కర్నూలులో ఉండాలి లేదంటే అమరావతిలో ఉండాలి కానీ.. వైజాగ్ కు రాజధానిని తరలించడం ఎందుకు.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఓవైపు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. వైజాగ్ గట్రా ఏది లేదు.. అయితే కర్నూలు లేదంటే అమరావతి రాజధాని అంటూ సీమ ప్రజలు కూడా అమరావతికే మద్దతు తెలుపుతుండటంతో సీఎం జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదట.

విశాఖకు పాలనా రాజధానిని తరలిస్తే ఊరుకోం అంటూ సీమ ప్రజలు జగన్ కు అల్టిమేటం కూడా జారీ చేస్తుండటంతో.. ఇది భవిష్యత్తులో జగన్ కు ఎటువంటి సమస్యలు తీసుకొస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us