IPL ని అపాలి, క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

Advertisement

క్రికెట్ ను అభిమానులు ఐపీల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యూఏఈలో ఐపీల్ ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. ఐపీల్ కోసం ఆటగాళ్లు కూడా సిద్ధమవుతున్నారు. ఐపీల్ ను స్పాన్సర్ చేస్తున్న వివో తొలగిన తరువాత ఇప్పుడు ఐపీల్ ను డ్రీమ్ 11 స్పాన్సర్ చేయనుంది. అన్ని సిద్ధమవుతున్నాయని అనుకునే లోపు క్రికెట్ అభిమానులకు ఒక షాక్ తగలనుంది. ఐపీల్ ను రద్దు చేయాలని ఒక వ్యక్తి కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.

ఆఅభిషేక్ లగూ అనే ఒక న్యాయవాది ఐపీల్ ను బయట దేశంలో నిర్వహించకూడదని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఐపీల్ ను బయటదేశంలో నిర్వహించడం వల్ల దేశ ఆదాయానికి గండి పడుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఐపీల్ ను ఇండియాలోనే నిర్వహించడం వల్ల ఈ కష్టకాలంలో దేశ ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుందని , అనేక మందికి ఉపాధి కూడా దొరుకుతుందని వెల్లడించారు. తాను కూడా క్రికెట్ అభిమానినని, కానీ ఐపీల్ ను మాత్రం వేరే దేశంలో నిర్వహించడం తగదని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here