కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

Advertisement

ముంబై: దేశంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడ్డారు. వారిలో అమితాబ్ ఫ్యామిలి కూడా ఉంది. అమితాబ్ ఇంట్లో జయ బచ్చన్ కు మిగితా అందరికి కరోనా వచ్చింది. దీంతో బచ్చన్ ఫ్యామిలి మొత్తం ముంబైలోని నానవతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. బచ్చన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా బచ్చన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించారు.

అభిమానుల పూజల వల్ల అమితాబ్ ఫ్యామిలీ లోని ఐశ్వర్య రాయ్, అధ్య కరోనా ముందు కొలుకోగా , అమితాబ్ ఈనెల ఆగస్ట్ 2న కరోనా నుండి కొలుకున్నారు. అయితే అప్పటికి అభిషేక్ కు ఇంకా పాజిటివ్ రావడంతో ఇంకా హాస్పిటల్ లో ఉన్నారు. కరోనాను జయించి వస్తానని ట్విట్టర్ లో అభిషేక్ ప్రామిస్ చేశారు. చెప్పిన్నట్టు గానే అభిషేక్ కూడా కరోనాను జయించారు. స్టేటస్ బోర్డ్ లో డిశ్చార్జ్ దగ్గర యస్ అని టిక్ పెట్టిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమితాబ్ ఫ్యామిలీ మొత్తం క్షేమంగా బయట పడటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here