Live video: ఇదెక్క‌డి దారుణం.. త‌ల్లి స్నానం చేస్తుంటే లైవ్ వీడియో పెట్టిన కూతురు

Live video: మాన‌వ‌త్వ‌పు విలువ‌లు చ‌చ్చిపోతున్నాయి. రోజురోజుకి మ‌నుషులు ప‌శువుల క‌న్నాదారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌న్న కూతురిని తండ్రి అత్యాచారం చేయ‌డం, లేదంటే త‌ల్లలు క‌డుపున పుట్టిన కూతురిని చంప‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు ఈ సంఘ‌ట‌న వీటన్నింటికి భిన్నం. త‌ల్లి స్నానం చేస్తుంటే కూతురు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్లో పెట్టిందన్న విషయం తెలిసి షాకవ్వడం ఆ తల్లి వంతైంది.

Baby girl started making live video of mom taking bath in bathroom
Baby girl started making live video of mom taking bath in bathroom

పిల్లలు పెద్దవాళ్లైతే… ఏది మంచో, ఏది చెడో తెలుసుకోగలుగుతారు. అదే పిల్లలుగా ఉన్నప్పుడు… వాళ్లు చేసే పనులు ఒక్కోసారి తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పిస్తాయి. బ్రియాన్నా విషయంలో అదే జరిగింది. ఆమె తన దారిన తాను బాత్‌రూంలో స్నానానికి వెళ్తూ… కూతురుకి మొబైల్ ఇచ్చింది. ఆ పాప గేమ్ ఆడుతుంటే… తాను స్నానం చేసి రావచ్చని అనుకుంది.

లోకం పోక‌డ తెలియ‌ని చిట్టి పాప చేతిలో మొబైల్‌ని ఆపరేట్ చేస్తూ… గేమ్ ఆడకుండా… దాన్ని క్లోజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసింది. నిజానికి ఆ పిల్లకు మొబైల్ ఆపరేట్ చెయ్యడం తెలియదు. ఏవేవో బటన్స్ నొక్కేసింది. ఆ తర్వాత… బాత్‌రూమ్ డోర్ కొట్టింది. లోపలున్న తల్లి ఏమైందని అడిగితే… గేమ్ రావట్లేదని చెప్పింది. దాంతో తల్లి డోర్ ఓపెన్ చేసింది.

కూతుర్ని లోపలికి పిలిచింది. పాప చేతిలో మొబైల్ తీసుకుంది. తన చేతులు తడిగా ఉండటంతో… టవల్‌తో చేతుల్ని తుడుచుకొని… ఆ తర్వాత మొబైల్‌ని చెక్ చేయసాగింది. తాను సెట్ చేసి పెట్టిన గేమ్ ఏమైంది అని ఆలోచిస్తూ… మొబైల్‌లోని నోటిఫికేషన్ విండో ఓపెన్ చేసింది. అక్కడి నోటిఫికేషన్ చూసి షాకైంది. ఆ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో రికార్డ్ అవుతోంది.

ఈ సంఘ‌ట‌న తెలుసుకొని షాకైన త‌ల్లి పాప‌ని ఏమ‌నాలో తెలియ‌క మ‌ద‌న‌ప‌డింది. ఈ సంఘ‌ట‌న కొందరు నవ్వుతూ కామెంట్స్ పెట్టగా… మరికొందరు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరో మహిళ… తాను స్నానం చేస్తున్నప్పుడు తన కూతురు… తెలియకుండానే ఫేస్‌బుక్ లైవ్ పెట్టిందని చెప్పారు.