Babar Azam : రేపు పాక్‌ గెలిస్తే.. బాబర్ ఆజమ్‌ ప్రధాని అవుతాడు!

NQ Staff - November 12, 2022 / 10:47 AM IST

Babar Azam : రేపు పాక్‌ గెలిస్తే.. బాబర్ ఆజమ్‌ ప్రధాని అవుతాడు!

Babar Azam : రేపు టీ20 వరల్డ్ కప్ – 2022 ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ రేపు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే 2048లో ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీం కెప్టెన్ బాబర్ ఆజమ్‌ పాకిస్తాన్ యొక్క ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సునీల్ గా గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1992 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ ఫైనల్ లో ఆడాయి.. అప్పుడు పాకిస్తాన్ జట్టు యొక్క కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన విషయం అందరికి తెల్సిందే.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన 22 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రధానిగా ఎంపిక అయ్యాడు. కనుక ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా రేపు వరల్డ్ కప్ నెగ్గితే కచ్చితంగా పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అవుతాడు అంటూ సునీల్ గవాస్కర్‌ అన్నాడు.

తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా మరియు పాకిస్తాన్ సోషల్ మీడియా లో ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది. బాబర్ ఆజామ్‌ అభిమానులు సునీల్ గవాస్కర్‌ మాటలు నిజమైతే బాగుండు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us