బిగ్ బ్రేకింగ్ : రాజమౌళికి & ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్

Admin - July 29, 2020 / 05:31 PM IST

బిగ్ బ్రేకింగ్ : రాజమౌళికి & ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్

చిన్నా పెద్ద , ధనిక పేద లాంటి ఏ తేడా కరోనాకి లేదు. దాని దృష్టిలో అందరూ ఒక్కటే . బాహుబలి లాంటి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఆయనతో పాటు కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ అని తెలిపారు . కానీ ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని , కొద్దిపాటి జ్వరం వచ్చి, తగ్గిపోయిందని చెప్పారు. మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం.
రోగ నిరోధక శక్తి పెంచుకుంటున్నాం. వైద్యులు సూచించిన విధంగా మేము హోం క్వారంటైన్‌ను విధించుకున్నాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
తాము పూర్తి స్థాయిలో కోలుకోగానే ప్లాస్మాను దానం చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి కుటుంబం కరోనా నుంచి క్షేమంగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్స్…

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us