అయోధ్య రామమందిరంలో 16 మందికి కరోనా

Advertisement

అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగష్టు 5 వ తేదీన భూమి పూజ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే పోలీసులకు మరియు పూజారులకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాంట్లో ఒక పూజారికి మరియు పదహారు మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే వీళ్ళందరూ కూడా ఆలయం దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. ఇక వీరికి పాజిటివ్ తేలడంతో ఆలయ పరిసరాలు అన్ని కూడా శానిటైజేషన్ చేస్తున్నారు.

ఇక ఐదవ తేదీన జరిగే ఈ భూమి పూజకు ప్రధాని నరేంద్రమోడీ తో పాటు 50 మంది వీవీఐపీలు, మరో 150 మంది గెస్టులు అధికారులు పాల్గొననున్నారు. అలాగే అయోధ్యా న‌గ‌రంలో భారీగా సీసీటీవీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని లైవ్‌లో వీక్షించే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here